Friday, 13 December 2024 08:18:53 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

మస్తాన్ సాయి అరెస్ట్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

Date : 13 August 2024 10:56 AM Views : 35

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Drugs Peddler Mastan Sai : నార్సింగి డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో డ్రగ్స్ సప్లయర్ గా ఉన్న మస్తాన్ సాయికి విజయవాడ 6వ మెట్రోపాలిటన్ కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజులు పాటు జ్యుడీషియల్ రిమాండ్ ను న్యాయస్థానం విధించింది. సోమవారం గుంటూరులో మస్తాన్ సాయిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో అతన్ని జైలుకు తరలించారు. గుంటూరు నగరానికి చెందిన మస్తాన్ సాయి బీటెక్ పూర్తిచేసి హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే, అతన్ని పీటీ వారెంట్ ద్వారా హైదరాబాద్ తరలించనున్నారు. అనంతరం కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మస్తాన్ సాయి పేరు తెరపైకి వచ్చింది. అతనిపై గతంలో డ్రగ్స్ సరఫరాకు సంబంధించి అనేక ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ, గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు అతను సప్లయ్ చేసేవాడు. హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ సప్లయర్ గా మస్తాన్ సాయి ఉన్నాడు. రాజ్ తరుణ్, లావణ్య కేసు వ్యవహారంలో ఇటీవల కాలంలో అతనిపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, జూన్ 3వ తేదీన విజయవాడ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా సెబ్ పోలీసులు దాడులు చేశారు. నలుగుర్ని అరెస్టు చేశారు. అయితే, మస్తాన్ సాయి మాత్రం పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. ఈ క్రమంలో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మస్తాన్ సాయిపై నిఘా పెట్టిన పోలీసులు.. అతన్ని అరెస్టు చేశారు. మస్తాన్ సాయి సెల్ ఫోన్లో పలువురు అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేటు వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు