Monday, 15 December 2025 01:26:52 AM
# Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ! # Bhagwant Mann: రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్ # Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్ # Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ # Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు # Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ # Nitish Kumar Reddy: హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

Chandrababu: దేశంలో టాప్ 5 రాష్ట్రాలతో పోటీపడేలా కొత్త పారిశ్రామికాభివృద్ధి విధానం: సీఎం చంద్రబాబు

Date : 13 August 2024 11:45 AM Views : 305

Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమల అభివృద్ధిలో దేశంలోని టాప్-5 రాష్ట్రాలతో పోటీ పడాలన్న లక్ష్యంతో, కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ విధానం రూపకల్పనలో నీతి ఆయోగ్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. 15 శాతానికి పైగా వృద్ధి రేటును సాధించడమే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక విధానం ఉండాలన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో, పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్, అధికారులతో కలిసి 2024-29 కాలానికి సంబంధించి కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానం ముసాయిదా పై చంద్రబాబు నాయుడుకు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, 2014-19 కాలంలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధిలో పొందిన బ్రాండ్ ఇమేజ్‌ను తిరిగి పొందేందుకు కృషి చేయాలని, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, మౌలిక సదుపాయాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని, పరిశ్రమలకు సత్వర అనుమతులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 10 ఓడరేవులు, 10 విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు, లాజిస్టిక్ సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో, పరిశ్రమలు ఏర్పాటుకు ఇవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయని ఆయన వివరించారు. తూర్పు తీర ప్రాంతం పశ్చిమ తీరంతో పోలిస్తే మెరుగైన రీతిలో రోడ్డు, రైలు, విమాన మార్గాలతో అనుసంధానం కలిగి ఉందనీ, నదుల అనుసంధానం పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ నెల 16న పారిశ్రామిక వేత్తలతో సమావేశం జరుపుతామని, ఈ నెల 23న మరోసారి నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంపై చర్చించనున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. మొదట, రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్, 2024-29 పారిశ్రామికాభివృద్ధి విధానం ముసాయిదాలో పొందుపర్చిన అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :