Studio18 News - ANDHRA PRADESH / : కడప లో వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పై కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కు సంబధించిన సాయిబాబా పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు బైఠాయించారు. కాగా కడప జిల్లా అక్కాయపల్లిలోని సాయిబాబా హైస్కూల్ లో 8వ తరగతి క్లాస్ రూంలో శ్లాబ్ పెచ్చులు ఊడి పడడంతో విద్యార్థులు గాయపడడం తెలిసిందే. పాఠశాల యాజమాన్యం నిబంధనలు పాటించలేదన్న విమర్శలు వినిపించాయి. ఈ స్కూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి సంబంధించినదని వెల్లడైంది. ఈ నేపథ్యంలో, వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పై కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ విజయ రామ రాజు ఆదేశాల మేరకు కడప ఆర్డీవో మధుసూదన్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి సంఘటన జరిగిన తీరుపై అరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడిపడి గాయాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. గాయాలైన విద్యార్థులకు న్యాయం జరగకపోతే బంద్ చేపడతామని హెచ్చరించారు.
Also Read : #kadapa : గుట్టుగా ఎర్రచందనం అక్రమ రవాణా
Admin
Studio18 News