Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : YS Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి వరద బాధితులను పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. న్యూ రాజరాజేశ్వరీపేటలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులను పరామర్శిస్తారు. రెండు రోజుల క్రితం సింగ్ నగర్ లో పర్యటించిన ఆయన బాధితులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు. కాగా, వరద బాధితులకు కోటి రూపాయిలతో సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వైఎస్ జగన్ నిన్న ప్రకటించారు. దీంతో వైసీపీ నాయకులు ఈ రోజు ఉదయం నుంచి వరద బాధితులకు పాలప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్ జగన్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం తప్పిదం వల్లే ఈ విపత్తు తలెత్తిందని, బాధితులను ఆదుకోకుండ తమపై నిందలు వేయడానికి అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వరద బాధితులు పడుతున్న బాధలను స్వయంగా చూశానని చెప్పారు. వారికి అండగా నిలబడాలని పార్టీ నాయకులు, శ్రేణులను వైఎస్ జగన్ ఆదేశించారు.
Admin
Studio18 News