Studio18 News - ANDHRA PRADESH / : AP IPS Officers Row : ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు నిర్ణయంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. వెయిటింగ్ లో ఉన్న 16 మంది ఐపీఎస్ అధికారులను హెడ్ క్వార్టర్స్ కు రావాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రతీ రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీజీపీ ఆఫీసులోనే ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటున్నారు. అయితే, డీజీపీ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండటం ఇష్టం లేని కొంతమంది ఐపీఎస్ లు.. వివిధ కారణాలతో లీవ్స్ కు అప్లయ్ చేసుకున్నారు. అయితే అప్లయ్ చేసుకున్న సెలవుల్లో ఎంతవరకు నిజం ఉందనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కారణాలు వాస్తవంగా ఉంటేనే సెలవులు ఇవ్వాలని, లేదంటే సెలవులు ఉండవని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
Admin
Studio18 News