Studio18 News - ANDHRA PRADESH / : వరద ముంపు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యటన కొనసాగుతోంది. యనమలకుదురుతో పాటు పటమట, రామలింగేశ్వర నగర్, జక్కంపూడిలో ఆయన పర్యటించారు. ప్రకాశం బ్యారేజీ దిగువ, ఎగువ ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడి పర్యటన జరిగింది. వాహనాలు వెళ్లలేని ప్రాంతాల్లో, బురదలో చంద్రబాబు నాయుడు కాలినడకన వెళ్తూ ప్రజల సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. ఇంకా ఎక్కువ లోతు ఉన్న ప్రాంతాల్లో బోట్ ద్వారా నేరుగా బాధితుల వద్దకు వెళ్తున్నారు. వరద ప్రాంతాల బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుని అధికారులకు చెప్పి అప్పటికప్పుడు పరిష్కారానికి ఆదేశాలు ఇస్తున్నారు. అంతేగాక, వరద ఉద్ధృతి, ముంపు నివారణ చర్యలను క్షేత్రస్థాయి నుంచి పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేసేందుకు సన్నద్ధమవుతోంది సర్కార్. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించేలా చర్యలు తీసుకోనున్నారు. ఫుడ్ బాస్కెట్స్ తీసుకెళ్లే విధానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీ విధానాన్ని చంద్రబాబు నాయుడికి ఐ అండ్ ఐ సెక్రటరీ సురేశ్ కుమార్ వివరించారు. 8-10 కేజీల వరకు ఫుడ్, మెడిసిన్, నీటిని డ్రోన్ల సరఫరా చేయొచ్చని సురేశ్ తెలిపారు.
Admin
Studio18 News