Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్టు చేశారు. అరెస్టు వార్తలను మీడియా ప్రసారం చేయడంతో మిగతా నేతలు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేశ్ తో పాటు, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆరోపణలు వున్న దేవినేని అవినాశ్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసులకు సంబంధించి అరెస్టును తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తిరస్కరించింది. దీంతో పోలీసులకు చిక్కకుండా మాజీ మంత్రి జోగి రమేశ్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారు. దేవినేని అవినాశ్ కూడా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు.
Admin
Studio18 News