Studio18 News - ANDHRA PRADESH / : Nagarjuna Yadav Arrested : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు వెళ్తుండగా పలమనేరు సమీపంలో ఆయన్ను అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున యాదవ్ పై ఇదివరకే కుప్పం పీఎస్ లో కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని నాగార్జున యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన న్యాయస్థానం ఈనెల 25వ తేదీ వరకు అరెస్టు చేయరాదని ఆదేశించిన విషయం తెలిసిందే.నాగార్జున యాదవ్ అరెస్టు పట్ల ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అరెస్టు చేయడం పట్ల కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు ప్రభుత్వం తీరును తప్పుబడుతున్నారు. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు వైసీపీ నేతలు చెప్పారు.
Admin
Studio18 News