Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తానని అంటున్నారని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని అంటున్నారని... అసలు జగన్ చేస్తున్న ఈ డిమాండ్ ఏమిటో తనకు అంతుపట్టకుండా ఉందని చెప్పారు. వినుకొండలో జరిగిన హత్యను ఒక పెద్ద సమస్యగా చిత్రీకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో జగన్ కు ప్రజాభిమానం తగ్గలేదని చూపించుకునేందుకు కొందరికి డబ్బులిచ్చి, వారిని తీసుకొచ్చి, వారితో జగన్ కు దండాలు పెట్టించి, వాటిని పత్రికల్లో రాయించుకుంటున్నారని విమర్శించారు. నాగార్జునసాగర్ నిర్మాణానికి భూములు, నిధులు ఇచ్చిన రాజా వాసిరెడ్డి రామగోపాల్ కృష్ణ మహేశ్వరప్రసాద్ విగ్రహాన్ని ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Admin
Studio18 News