Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : సాక్షిపై పరువు నష్టం కేసులో ఏపీ మంత్రి నారా లోకేశ్ కోర్టుకు హాజరయ్యారు. విశాఖపట్టణం 12వ అదనపు జిల్లా కోర్టుకు లోకేశ్ హాజరయ్యారు. ‘‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’’ పేరుతో సాక్షి వార్త పత్రికలో గతంలో ఓ కథనం ప్రచురితమైంది. దీనిపై ఆయన కోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తున్నారు. దీనిలో భాగంగా లోకేశ్ ఆ పత్రికపై పరువు నష్టం దావా వేశారు. వేర్వేరు కారణాలతో చాలా రోజులుగా వాయిదాలు పడిన ఈ కేసు గురువారం విచారణకు రావడంతో ఆయన కోర్టుకు వెళ్లారు.
Admin
Studio18 News