Studio18 News - ANDHRA PRADESH / : Duvvada Family Controversy : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటివద్ద శుక్రవారం అర్థరాత్రి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కవరం సమీపంలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి రాత్రి 11గంటల సమయంలో పెద్దకుమార్తె హైందవితోకలిసి దువ్వాడ శ్రీనివాస్ సతీమణి, టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి వెళ్లారు. ఇంటి గేట్లను బలవంతంగా తెరిచే ప్రయత్నం చేశారు. గేట్లు తెరుచుకోక పోవడంతో క్యాంపు కార్యాలయం డోర్లను కట్టర్లతో కట్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్దెత్తున దువ్వాడ నివాసం వద్దకు చేరుకొని ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. భార్య, కుమార్తె అర్థరాత్రి తన ఇంటికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న దువ్వాడ శ్రీనివాస్.. ఆయన సోదరుడు, అనుచరులతో కలిసి నివాసానికి వచ్చాడు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటిలోకి వస్తూనే భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దువ్వాడ, అతని సతీమణి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికిలోనైన దువ్వాడ శ్రీనివాస్ ఆయన సతీమణిపై దాడికి యత్నించాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు దువ్వాడను అడ్డుకొని వాణికి రక్షణగా నిలిచారు. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్, ఆయన సోదరుడు శ్రీధర్, మరోవైపు దువ్వాడ వాణి, హైందవిల మధ్య తీవ్ర వాదోపవాదనలు కొనసాగాయి. క్యాంపు కార్యాలయం ఖాళీచేసి వెళ్లిపోవాలని దువ్వాడ వాణి పట్టుబట్టింది. అయితే, ఈ కార్యాలయం తాను కట్టించిందని దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడు చెప్పాడు. దీంతో ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వాణిని లోపలికి రానివ్వకపోవటంతో క్యాంప్ కార్యాలయం ఖాళీ చేసే వరకు ఇక్కడే ఉంటానంటూ క్యాంప్ కార్యాలయం బయటనే దువ్వాడ వాణి నిద్రించారు. ఇదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్ నివాసానికి వాణి తల్లిదండ్రులు చేరుకొని దువ్వాడ శ్రీనివాస్ తో వాగ్వివాదానికి దిగారు. ఏ హక్కుతో మాధురి తన భర్తతో ఉంటుందని దువ్వాడ వాణి ప్రశ్నించారు.. ఆయన వల్ల తాను డబ్బుతోపాటు పేరును పోగొట్టుకున్నానని అన్నారు.
Admin
Studio18 News