Monday, 02 December 2024 12:47:43 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

CM Chandrababu: సంక్షేమం, అభివృద్ధి రెండు క‌ళ్లుగా పాల‌న‌కు శ్రీకారం: సీఎం చంద్ర‌బాబు

Date : 15 August 2024 12:26 PM Views : 31

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : స్వాతంత్ర్యం దినోత్స‌వం సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు విజ‌య‌వాడలోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో జాతీయ‌జెండాను ఆవిష్క‌రించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గ‌త ఐదేళ్ల‌లో దెబ్బ‌తిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తెస్తామ‌ని తెలిపారు. ఏపీ ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్య్రం లభించిందన్న చంద్ర‌బాబు.. ఐదేళ్లుగా ప్ర‌జ‌లు కోల్పోయిన స్వేచ్ఛ‌ను అందించేందుకు క‌ట్టుబ‌డి ఉంటామ‌న్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు క‌ళ్లుగా పాల‌న‌కు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం నిర్వీర్యం చేసిన శాఖ‌ల్ని పున‌రుద్ధ‌రించే ల‌క్ష్యంతో 100 రోజుల ప్ర‌ణాళిక‌తో అన్ని శాఖ‌ల్లో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. విభ‌జ‌న‌తో ఏర్ప‌డిన న‌వ్యాంధ్ర‌కు రాజ‌ధాని కూడా లేని ప‌రిస్థితిలో నాడు పాల‌న ప్రారంభించిన‌ట్లు గుర్తు చేశారు. అటువంటి ప‌రిస్థితి నుంచి ప్ర‌భుత్వాన్ని ప‌ట్టాలెక్కింమ‌న్నారు. ప్ర‌జ‌ల స‌హ‌కారం, త‌మ‌కు ఉన్న అనుభ‌వంతో నిల‌దొక్కున్న‌ట్లు తెలిపారు. 120కి పైగా సంక్షేమ ప‌థ‌కాలు తీసుకువ‌చ్చి ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌రిచామ‌ని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్ర‌థ‌మంగా నిలిచామ‌న్నారు. రూ. 16 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులకు వివిధ సంస్థ‌ల‌తో ఒప్పందాలు చేసుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించామ‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు