Saturday, 24 January 2026 08:25:20 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Kethireddy Venkatarami Reddy: కూటమి ప్రభుత్వంపై విమర్శలు సరికాదు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

Date : 01 August 2024 01:25 PM Views : 497

Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చి రెండు నెలల కూడా కాకముందే పథకాలు ఇవ్వడం లేదంటూ విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. ఈ స్వల్ప వ్యవధిలోనే అద్భుతాలు జరిగిపోతాయని భావించడం సరికాదన్నారు. సంపద సృష్టించిన తర్వాతే అమ్మ ఒడి వంటి పథకాలను ఇస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని మర్చిపోకూడదని సొంత పార్టీ నేతలకు హితవు పలికారు. అందుకోసం ఈ ఏడాది చివరి వరకైనా అవకాశం ఇవ్వాలని సూచించారు. అప్పటికీ వారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే అప్పుడు ప్రభుత్వంపై ఎలా పోరాడాలనేదానిపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో వీడియో పోస్టు చేశారు. ఇసుక, మద్యం విషయంలో తమ ప్రభుత్వ విధానాలను కేతిరెడ్డి తప్పుబట్టారు. ప్రభుత్వం పాలన చేయాలి తప్పితే వ్యాపారాలు చేయకూడదని అన్నారు. దీనికి తాను తొలి నుంచీ వ్యతిరేకమేనని స్పష్టం చేశారు. దీనివల్లే తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇప్పుడదే చేస్తోందని విమర్శించారు. అలాగే, తమ ప్రభుత్వం వసూలు చేసిన చెత్తపన్నును సమర్థించారు. నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని జగన్ పదేపదే చెప్పడంతో మిగతా వర్గాలు ఆయనకు దూరమయ్యారని అన్నారు. తాము అన్ని పథకాలు అమలు చేసినప్పటికీ 11 సీట్లకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ప్రభుత్వానికి మనం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని, కాబట్టి అప్పుడే ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అల్లర్లపైనా కేతిరెడ్డి స్పందించారు. మనం వేసిన బంతి తిరిగి మనకే వచ్చి తగులుతోందని అన్నారు. అప్పట్లో ఇలాంటి వాటిని ప్రోత్సహించిన వారు ఇప్పుడు కనిపించడం లేదన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :