Thursday, 12 December 2024 01:20:02 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Pawan Kalyan : ఇంగ్లీష్ ఉండాలి కానీ ఇంగ్లీష్ కోసం పడి చచ్చిపోకూడదు.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు..

Date : 30 August 2024 10:59 AM Views : 41

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Pawan Kalyan : నిన్న ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికార భాషా దినోత్సవంని విజయవాడలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్, పలువురు మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. వ్యావహారిక భాషోద్యమ పితామహుడు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారికి నివాళులు అర్పిస్తూ ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నాకే ఆంగ్ల పదాలు లేకుండా తెలుగు మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంగ్లీష్ పదాలు లేకుండా తెలుగు మాట్లాడలేకపోతున్నాము. మరాఠి, తమిళ్ లో ఇంగ్లీష్ పదాలు ఒక్కటి కూడా వాడకుండా శుద్ధమైన మాతృభాష మాట్లాడతారు. వారు వాళ్ళ భాషపై ప్రయోగాలు చేస్తారు. మన దగ్గర మనం ఎంత చేయగలమో తెలియదు కానీ మాతృభాషకు మాత్రం మనం పెద్దపీట వేయకపోతే చేజేతులా మన భాషని మనమే నాశనం చేసుకున్నట్టే. అలాగే పిల్లలు, యువత తెలుసుకోవాలి ఇంగ్లీష్ మాట్లాడితేనే చదువులు కాదు. ఇంగ్లీష్ ఉండాలి కానీ ఇంగ్లీష్ కోసం పడి చచ్చిపోకూడదు. ఇంగ్లీష్ లేకపోతే బతుకు లేదు అనేది ఏం లేదు. ఇంగ్లీష్ చదివితేనే తెలివి తేటలు వస్తాయి, బతుకుతాం అనే దుస్థితి నుంచి మనం బయటపడాలి అని కోరుకుంటున్నాను అని తెలిపారు. దీంతో పవన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు