Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడడం చూసి జనాలు నవ్వుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు అన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన అసాధ్యమని చెప్పిన ఆయన.. జగన్ డిమాండ్ చేయడం చూస్తుంటే రాజకీయాల్లో ఆయనకు ఓనమాలు తెలియవని స్పష్టం అవుతుందన్నారు. దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ తనకు భగవంతుడితో సమానమని.. దయచేసి ఇలాంటి డిమాండ్లు చేసి నవ్వుల పాలు కావద్దని కోరారు. ఇక ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కావడంపై కూడా గోనె ప్రకాశ్ రావు స్పందించారు. మాజీ ఎమ్మెల్యేగా చంద్రబాబును మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని తెలిపారు. ఎలాంటి రాజకీయ పదవులు ఆశించి సీఎం కలవలేదన్నారు. ప్రస్తుతం తాను ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్నానని చెప్పిన ఆయన.. చనిపోయేంత వరకు అందులోనే ఉంటానని చెప్పుకొచ్చారు.
Admin
Studio18 News