Monday, 02 December 2024 01:18:08 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

YS Sharmila: తలా తోక లేని వివరణ ఇచ్చారు: వైఎస్ షర్మిల ఆగ్రహం

Date : 09 August 2024 04:55 PM Views : 46

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ తలా తోక లేనిదంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. దీనిపై ఆమె ఎక్స్ లో ట్వీట్ చేశారు. ‘సాగర్ కుడికాలువ కింద రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా? పల్నాడు జిల్లాలో కౌంటర్ల దగ్గర రైతుల పడుతున్న కష్టాలు మీకు కనిపించడం లేదా? సంబంధిత శాఖ మంత్రిగా నేరుగా పరిస్థితి చూసే మాట్లాడుతున్నారా? రాత్రంతా క్యూలైన్లో రైతులను నిలబెట్టడమా మీ NDA ప్రభుత్వ కట్టుబడి? సంక్షోభం నుంచి సంక్షేమం అంటే కుండపోత వర్షంలో మహిళలను ఇబ్బందులు పాలు చేయడమే కాబోలు’ అని విమర్శలు గుప్పించారు. ‘రైతుల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ము లేక కుటుంబాన్ని గుంజుతున్నారు. YCP ప్రభుత్వానికి రైతు సంక్షేమం పట్టకనే కదా… మీకు పట్టం కట్టింది. జగన్ నిండా ముంచారు అనే కదా 11 సీట్లకు పరిమితం చేసింది. మోసం చేశారు అనే కదా కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. రైతులను వ్యతిరేకించే బీజేపీ తో మీరు కూటమి కట్టి, పక్షపాతిగా ఉంటామని హామీలు ఇచ్చి, గద్దెనెక్కి, ఇప్పుడు వాళ్లను వర్షంలో నిలబెట్టారు. ఇది మీ సర్కారుకి న్యాయమా?’ అని షర్మిల అన్నారు. ‘నాట్లు వేసిన 130 రోజుల్లోనే పంట చేతికి వస్తుందని జేజీఎల్ – 384 రకం విత్తనాలను కావాలని అడగడం రైతులు చేసిన పాపం అంటారా మంత్రిగారు! రైతు అడిగింది ఇవ్వాలని హక్కుగా మేము ప్రశ్నిస్తే… రెచ్చ గొట్టినట్లు ఎలా అవుతుందో , వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలి’ అని నిలదీశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు