Monday, 02 December 2024 02:01:49 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

corporators: వైసీపీకి విశాఖపట్నం కార్పొరేటర్ల షాక్

Date : 07 August 2024 11:20 AM Views : 36

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్ లు ఆ పార్టీకి షాక్ ఇచ్చి జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నాడు పార్టీ అధినేత, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జీవీఎంసీ 42,43,47,59,77వ వార్డు కార్పొరేటర్ లతో పాటు పలువురు మాజీ కార్పొరేటర్ లు, కనకమహాలక్ష్మి ఆలయ మాజీ చైర్మన్ కర్రిపోతుల ప్రసాద్, లోక్ సత్తా జోనల్ మాజీ నాయకుడు మంచిపల్లి సత్యనారాయణ తదితరులు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ .. ఎన్నికల తర్వాత మొట్టమొదటి రాజకీయపరమైన చేరికలు ఇవి అన్నారు. తనకు ఎంతో ఇష్టమైన విశాఖ నుంచి చేరికలు మొదలు కావడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరపున బలంగా విజయం సాధించే విధంగా అంతా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. విశాఖలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తాం విశాఖలో కాలుష్య సమస్య చాలా ఎక్కువగా ఉందని, దేశంలోనే వాయు, జల కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరంగా విశాఖ ఉందని అన్నారు. కార్పొరేటర్లుగా కాలుష్య నియంత్రణ బాధ్యత వారిపై ఉందని చెప్పారు. పర్యావరణ శాఖ మంత్రిగా కాలుష్య నియంత్రణ మండలి తన పరిధిలో ఉందని, ఎక్కడైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పవన్ కల్యాణ్ సూచించారు. విశాఖలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు