Saturday, 07 March 2026 08:06:26 PM
# డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం # మందమర్రి CER క్లబ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # గజ్వేల్ ఎంఆర్ఓ ఇంటిపై ఏసీబీ దాడులు

APSRTC: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు తేదీపై మంత్రి స్పందన

Date : 10 August 2024 12:07 PM Views : 357

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉచిత బస్సు సదుపాయం కోసం మహిళలు ఎదురుచూపులు చూస్తున్నారు. ఉచిత బస్సు సదుపాయం కల్పించే అంశంపై ఇప్పటికే అధికారుల బృందం ఇటు తెలంగాణ, అటు కర్ణాటకలో అధ్యయనం చేసి వచ్చింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేస్తారని వార్తలు వినబడుతున్నాయి. అయితే అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. దీంతో మహిళల ఉచిత బస్సు పథకం ప్రారంభోత్సవానికి మరో రోజు నిర్ణయిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అర్టీసీ, రవాణా శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళల ఉచిత బస్సు సదుపాయం ఎప్పటి నుంచి అనే విషయమై స్పష్టత ఇవ్వలేదు. కానీ, త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. 12న మరోసారి ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో సమీక్ష జరుగుతుందని, ఇందులో సీఎం చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపైన అధికారులతో చర్చిస్తారని మంత్రి తెలిపారు. మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. దీంతో 12వ తేదీ జరిగే సమీక్షపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఆ రోజునే మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమలు తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు, గత ప్రభుత్వ తీరుపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైందని మండిపడ్డారు. కారుణ్య నియామకాలపై ఈ సమావేశంలో చర్చించామని తెలిపిన ఆయన .. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎంతో చర్చిస్తామని తెలిపారు. ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్తవి తీసుకొస్తామని వెల్లడించారు. ఆర్టీసీలో ఏడువేల మంది సిబ్బంది కొరత ఉందని ఈ సందర్భంగా వెల్లడించిన మంత్రి .. వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :