Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : kakani govardhan reddy : టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు సోమిరెడ్డి రూ. మూడు లక్షలు డిమాండ్ చేశారని బీజేపీ నేత పెంచలయ్య ఆరోపించారు. తన వద్ద అంత డబ్బులు లేవని చెప్పినా.. సోమిరెడ్డి కనికరించలేదని గోవర్ధన్ రెడ్డి అన్నారు. అది మేము చేయించినట్లు ఆరోపిస్తున్నారని, మాకు, ఆయనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. నగదు చేతులు మారాయని అందువల్లే విమర్శలు చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉంది.. మా ఫోన్లపై నిఘా పెట్టారు. పెంచలయ్య ఆరోపణలపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆయన వీడియోను ఫార్వర్డ్ చేసినందుకు నాపై A2గా కేసు పెట్టారని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు కేసులకు భయపడం. సోమిరెడ్డి అవినీతికి పాల్పడినా మాట్లాడకూడదా.. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు., అంగన్వాడి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు ఉద్యోగుల బదిలీలకు కూడా డబ్బులు తీసుకుంటున్నారని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో లే అవుట్ యజమానుల నుంచి మామూళ్ళు తీసుకున్నారు. అప్పట్లో వాళ్లందరూ నా బినామీలు అన్నారు. లే అవుట్ లన్నీ ధ్వంసం చేశారు. ఇప్పుడు డబ్బులు తీసుకొని.. వాటికి అనుమతులు ఇస్తున్నారని కాకాణి అన్నారు. కేసులకు భయపడం.. భయపడితే రాజకీయాల్లో ఉండగలమా. సోమిరెడ్డి చేసే అవినీతి పనులకు సంబంధించి ఒక రికార్డును విడుదల చేస్తామని చెప్పారు. ఇరిగేషన్ పనులను పరిశీలించడం, కాంటాక్టర్లను బెదిరించి.. మామూళ్లు వసూలు చేయడం సోమిరెడ్డికి అలవాటుగా మారింది. ఎస్ఎన్‌జె డిస్టీలరీస్ నుంచి నేను మామూళ్లు తీసుకున్నానని సోమిరెడ్డి ఆరోపించారు. దమ్ముంటే నిరూపించాలిని కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ చేశారు. ప్రస్తుతం సోమిరెడ్డి ఇసుక, గ్రావెల్, మట్టిని అక్రమ రవాణా చేసి దోచుకుం టున్నారని కాకాణి ఆరోపించారు.
Admin
Studio18 News