Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : CM Chandrababu : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతి భద్రతలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అసెంబ్లీలో ఈ శ్వేతపత్రం విడుదల చేస్తారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగానే.. ఇటీవల చనిపోయిన మాజీ శాసనసభ్యులు పెండ్యాల వెంకట కృష్ణారావు, యెర్నేని సీతాదేవి, అనిశెట్టి బుల్లబ్బాయ్ రెడ్డి, సద్దపల్లి వెంకటరెడ్డిలకు సభ్యులు సంతాపం ప్రకటించనున్నారు. అనంతరం శాసనసభలో ప్రశ్నోత్తరాలు సమయం ప్రారంభమవుతుంది.ప్రశ్నోత్తరాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, ప్రత్యేక అవసరాల విద్యార్థుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం, సంఘ విద్రోహశక్తుల నియంత్రణ, విశాఖపట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాలలో సౌకర్యాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. అదేవిధంగా ఎస్సీ,ఎస్టీల సంక్షేమ పథకాల రద్దు, రాష్ట్రంలో టిడ్కో గృహాలు, సుప్రీంకోర్టులో కేసులు, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కెసి కెనాల్ మళ్లింపు, బదిలీచేయదగిన అభివృద్ధి హక్కులుపై ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. అనంతరం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ల వైసీపీ హయాంలో అదుపుతప్పిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేస్తారు.శాసన మండలిలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అదుపుతప్పిన శాంతి భద్రతలపై హోమ్ మంత్రి వంగలపూడి అనిత శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. తొలుత శాసన మండలిలో ప్రశ్నోత్తరాలలో.. ప్రైవేటు ఏజన్సీలకు మోనజైట్ సిలికాన్ ల అనధికార విక్రయం, రాష్ట్రం లో ఇ-వ్యర్ధాల తొలగింపు, 2023 – 2024 మధ్యకాలంలో ధాన్యం సేకరణ, నిత్యావసరాల ధరల పెరుగుదల, పంటల బీమా బకాయిల చెల్లింపుపై ప్రశ్నలకు మంత్రుల సమాధానం ఇవ్వనున్నారు. అదేవిధంగా రైతులకు పెట్టుబడి సాయం, మంగంపేట బెరైటీస్ గనులలో అక్రమాలు, రాష్ట్రంలో నూతన విద్య కళాశాలలు, పులివెందులలో గృహనిర్మాణ ప్రాజెక్టులో అనర్హులైన లబ్ధిదారులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రశ్నలకు మంత్రుల సమాధానం ఇవ్వనున్నారు.
Admin
Studio18 News