Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Duvvada Srinivas Family Issue : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం దువ్వాడ ఫ్యామిలీ దుమారం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అతని భార్య వాణి పరస్పర ఆరోపణలతో ఇంటిగుట్టు రచ్చకెక్కింది. దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురితో ఉంటున్నాడని అతని భార్య వాణి, వారి కుమార్తె హైందవి ఆరోపిస్తున్నారు. దీంతో శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన కొనసాగిస్తున్నారు. రెండు రోజులుగా కార్యాలయం వద్ద ఆరుబయటనే హాణి, హైందవీలు టెంటు వేసుకొని నిద్రిస్తున్నారు. తమ కార్యాలయంలో దువ్వాడ శ్రీను మరో మహిళతో కలిసి అనైతిక చర్యలకు పాల్పడుతున్నాడని దువ్వాడ వాణి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెక్కలిలో తమ పరువుకు భంగం కలిగే చర్యలు మానుకోవాలని, అనైతిక చర్యలకు పాల్పడుతున్న దువ్వాడను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని వాణి డిమాండ్ చేసింది. నా భార్య దువ్వాడ వాణి వెనుకాల మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నాడని, అచ్చెన్నాయుడు కుట్రలో భాగంగానే వాణి, కూతురు హైందవిలు తనపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం ఎదుటే వాణి, హైందవీలు నిరసన తెలుపుతుండటంతో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఇరువర్గాలపై పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. డైవర్స్ నోటీసు ఇచ్చేందుకు దువ్వాడ శ్రీనివాస్ సిద్ధమవుతుండగా.. ఇల్లు విడిచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా లేమని దువ్వాడ వాణి స్పష్టం చేసింది. దివ్వెల మాధురిని ఇంటి నుంచి బయటకు పంపించాలని శ్రీనివాస్ ను వాణి డిమాండ్ చేస్తుంది.
Admin
Studio18 News