Wednesday, 10 December 2025 02:34:27 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

జనసేన వైపు చూస్తున్న మాజీ వైసీపీ నేతలు ఎవరు?

Date : 27 July 2024 10:06 AM Views : 247

Studio18 News - ANDHRA PRADESH / : Gossip Garage : శాసనమండలి పక్ష నేత నియామకం వైసీపీలో చిచ్చు రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య పార్టీకి రాజీనామా చేయడం వెనుక శాసనమండలిలో వైసీపీ పక్ష నేత కూడా ఓ కారణమా? మాజీ ఎమ్మెల్యేకు… శాసనమండలి పక్ష నేతకు మధ్య లింకేంటి? వైసీపీలో మండలిపక్ష నేత రేపిన మంటలు ఏంటి? ఏదో కారణం చూపి పార్టీ నుంచి జంప్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల తీరు మారుతున్నట్లు కనిపిస్తోంది. అధికారం కోల్పోవడంతో ఐదేళ్ల పాటు వైసీపీలో కొనసాగలేమని భావిస్తున్న నేతలు.. ఏదో కారణం చూపి పార్టీ నుంచి జంప్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతుండగా, కొందరు ముందుగా పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టి పెడదామని భావిస్తున్నారు. తన మామ కోసమే వైసీపీకి రాజీనామా..! అలాంటి వారిలో గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఒకరు. వైసీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు స్వయంగా అల్లుడైన రోశయ్య 2019లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఆయనను గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా నిలిపింది వైసీపీ. ఐతే పార్లమెంట్‌ ఎన్నికల్లో భారీ తేడాతో ఓటమి చెందిన కిలారి రోశయ్య… ఫలితాలు విడుదల నుంచి పార్టీపై గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. సమయం చూసుకుని పార్టీని వీడాలని ఇన్నాళ్లు వేచి చూసిన రోశయ్య… మండలిలో శాసనసభాపక్ష నేతగా గుంటూరుకు చెందిన లేళ్ల అప్పిరెడ్డిని నియమించిన వెంటనే… పార్టీకి రాజీనామా చేశారు. వాస్తవానికి లేళ్ల అప్పిరెడ్డికి.. రోశయ్య రాజీనామాకు నేరుగా ఎటువంటి సంబంధం లేకపోయినా… తన మామ ఉమ్మారెడ్డి కోసమే రోశయ్య ముందుగా బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. అందుకే ముందుగా అల్లుడితో పార్టీకి రాజీనామా చేయించారట.. వైసీపీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు టీడీపీలో క్రియాశీలంగా పనిచేసిన ఉమ్మారెడ్డి… చంద్రబాబుతో విభేదిస్తూ వైసీపీలో చేరారు. ఇక ఆయన సీనియార్టీని దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత జగన్‌ కూడా సముచిత గౌరవమే ఇచ్చారు. గత ప్రభుత్వంలో చీఫ్‌ విప్‌ పదవిని కట్టబెట్టారు. ఐతే, పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత శాసనమండలిలో విపక్ష నేత హోదాపై కన్నేశారు ఉమ్మారెడ్డి. వైసీపీ పక్ష నేతగా తనకు అవకాశం ఇస్తే.. విపక్ష హోదాతో కేబినెట్‌ సౌకర్యాలు అనుభవించొచ్చని భావించారు. ఐతే తాను ఒకటి తలిస్తే… పార్టీ మరోకటి ఆలోచించింది. ఉమ్మారెడ్డికి బదులుగా గుంటూరు జిల్లాకే చెందిన లేళ్ల అప్పిరెడ్డికి శాసనమండలి వైసీపీ పక్ష నేతగా నియమించింది. ఈ పరిణామం రుచించని ఉమ్మారెడ్డి అసంతృప్తికి లోనైనట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ముందుగా తన అల్లుడైన కిలారి రోశయ్యతో పార్టీకి రాజీనామా చేయించారని అంటున్నారు. జనసేనలో చేరేందుకు ఆసక్తి.. తన వియ్యంకుడైన తిరుపతి ఎమ్మెల్యేతో రాయబారం.. ఇక వైసీపీ నుంచి బయటకు వచ్చిన కిలారి రోశయ్య… జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇందుకోసం తన వియ్యంకుడైన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ద్వారా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో చర్చలకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఐతే రోశయ్య, ఉమ్మారెడ్డి ఇద్దరూ ఒకేసారి జనసేనలో చేరతారా? లేక ముందుగా రోశయ్య… తర్వాత ఉమ్మారెడ్డి వెళతారా? అన్న చర్చ జరుగుతోంది. ఐతే వయసురీత్యా తాను వెళ్లే కన్నా.. తన కుమారుడు రాజకీయ భవిష్యత్‌ కోసం అల్లుడు రోశయ్యతోపాటు కుమారుడు వెంకటరమణను జనసేనకు పంపించాలని ఉమ్మారెడ్డి భావిస్తున్నట్లు ఇంకో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వైసీపీకి రాజీనామా చేసిన కిలారి రోశయ్య తనతోపాటు కుటుంబ సభ్యులను కూడా జనసేనలోకి తీసుకువెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. గుంటూరు జిల్లా వైసీపీలో కలకలం.. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గుంటూరు జిల్లా వైసీపీలో కలకలం చెలరేగుతోంది. ఇప్పటికే గుంటూరు నగర పార్టీ అధ్యక్ష పదవికి.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే మద్దాల గిరి రాజీనామా చేయగా, ఆయన వెనుక రోశయ్య కూడా వైసీపీకి బైబై చెప్పేశారు. ఈ లిస్టులో మరికొందరు ఉన్నారంటున్నారు. ఐతే ఇలా వైసీపీ నుంచి బయటకు వచ్చిన నేతలకు టీడీపీలో అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా జనసేనను ఎంచుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదైనా సరే వైసీపీ నేతలు చేరే విషయంలో కూటమిలోని మూడు పార్టీలు ఒకే మాటపై ఉండాలని ఇటీవల నిర్ణయించడంతో వైసీపీ మాజీ నేతల చేరికపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :