Thursday, 12 March 2026 04:11:39 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

హైదరాబాద్‌లో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను అరెస్టు చేసిన మంగళగిరి పోలీసులు

Date : 05 September 2024 11:01 AM Views : 266

Studio18 News - ANDHRA PRADESH / : బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్‌ను మంగళగిరి గ్రామీణ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సురేశ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేశ్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న మంగళగిరి గ్రామీణ పోలీసులు హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేసి, ఆయనను గుంటూరు జిల్లాకు తరలిస్తున్నారు. ఆయనను ముందుగా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెడతారు. కాగా, గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో నందిగం సురేశ్ సహా లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలశిల రఘురామ్ కోసం పోలీసులతో అధికారులు బృందాలను ఏర్పాటు చేశారు. నందిగం సురేశ్‌ను అరెస్టు చేసేందుకు నిన్న పోలీసులు ఉద్దండరాయునిపాలెంలోని ఆయన ఇంటికి వెళ్లారు. అక్కడ కొద్దిసేపు పోలీసులు వేచిచూసి వెనుదిరిగారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి ఆయన ఆచూకీ గుర్తించినట్లు తెలుస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :