Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, కుమార్తె హైందవిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తన నివాసం వద్ద తరుచూ ఆందోళన చేపడుతున్న దువ్వాడ వాణి, హైందవిని పోలీసులు నిలవరించడం లేదని దువ్వాడ శ్రీనివాస్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన బార్య వాణి, కుమార్తె హైందవిపై కేసు నమోదు చేసి 41ఏ నోటీసులు జారీ చేశామని హైకోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారంలో కొన్ని వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. తన భర్త తమను పట్టించుకోవడం లేదంటూ దువ్వాడ వాణి తన కుమార్తెతో కలిసి ఆయన ఇంటి ముందు దీక్షకు దిగారు. దీంతో రాజీకి చర్చలు కూడా జరిగాయి.
Admin
Studio18 News