Studio18 News - ANDHRA PRADESH / : GV Anjaneyulu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీకి నిధుల కోసం వెళ్తారని, మాజీ సీఎం జగన్ మాత్రం బాబాయి హత్య కేసు నుంచి బయటపడడానికి, ఇతర కేసుల మాఫీ కోసం వెళ్తారని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. అమరావతిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జీవీ ఆంజనేయులు మాట్లాడారు. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర పరువును జగన్ ఢిల్లీలో తాకట్టు పెట్టారని అన్నారు. గతంలో కేసుల మాఫీ కోసం ఢిల్లీ వెళ్లారని తెలిపారు. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో 256 హత్యలు జరిగాయని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఎందుకు హత్యలు, దాడులకు గురైన కుటుంబాలను పరమర్శించలేదని నిలదీశారు. తాడేపల్లి సమీపంలో యువతిపై సామూహిక అత్యాచారం చేస్తే ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. కనీసం అప్పటి మంత్రులు కూడా పరామర్శించలేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై వైసీపీ ప్రభుత్వంలో హత్యలు, దాడులకు తెగబడ్డారని చెప్పారు. అసెంబ్లీలో 11 మందితో మొహం చూపించలేక జగన్ తప్పించుకుంటున్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైన జగన్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు.
Admin
Studio18 News