Friday, 18 July 2025 07:10:06 AM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

AP High Court: బాలినేని రీకౌంటింగ్ పిటిషన్ పై ముగిసిన విచారణ .. తీర్పు రిజర్వ్

Date : 22 August 2024 02:18 PM Views : 111

Studio18 News - ANDHRA PRADESH / : ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని కొన్ని ఈవీఎంలలో ఓట్లు లెక్కించాలని కోరుతూ మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తీర్పు రిజర్వు చేశారు. ఎన్నికల ఫలితాల్లో రెండు మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్ధుల వినతి మేరకు ఈవీఎం, వీవీప్యాట్లను పరిశీలించి స్లిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, దానికి భిన్నంగా .. మాక్ పోలింగ్ నిర్వహించేందుకు వీలుగా 16 జులై 2024న ఈసీ టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను జారీ చేసిందని బాలినేని తరపు న్యాయవాది న్యాయస్థానానికి విన్నవించారు. ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. బాలినేని తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అయితే పిటిషనర్ల తరపు వాదనను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తరపు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుగా అర్ధం చేసుకున్నారని వాదనలు వినిపించారు. వీవీ ప్యాట్ స్లిప్ లను లెక్కించి ఈవీఎంలో పోలైన ఓట్లతో సరి పోల్చాలని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. ఈవీఎంలో సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేస్తారని, అది ఏమైనా ట్యాంపర్ జరిగిందా లేదా అనే విషయాన్ని మాత్రమే అభ్యర్ధుల సమక్షంలో సాంకేతిక నిపుణులు పరిశీలించాలని సుప్రీంకోర్టు పేర్కొందని చెప్పారు. ఈ నేపథ్యంలో వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు ప్రశ్నే ఉత్పన్నం కాదని తెలిపారు. మాక్ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించిందన్నారు. ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :