Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Bhuma Akhila Priya : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, టీడీపీ నేత భూమా అఖిలప్రియ ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నేనేంటో చూపిస్తా అంటూ హెచ్చరించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి ప్రెస్ మీట్లు పెట్టి నా గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోనని హెచ్చరించారు. మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే నా మీద వేసిన నిందలకు మీ దగ్గర ఆధారాలు ఉంటే చర్చకు నేను రెడీ.. ఏ పోలీసులు మిమ్మల్ని అడ్డుకోరు.. ఏ పోలీసులు మిమ్మల్ని హౌజ్ అరెస్ట్ చేయరు. మున్సిపల్ కార్యాలయం వద్ద మీటింగ్ పెడదాం.. మీరు రండి.. నేనుకూడా వస్తా. మీడియా ముందు చర్చపెడదాం అంటూ అఖిలప్రియ అన్నారు. నాపై మీరుచేసే ఆరోపణలకు సంబంధించి ఆధారాలను చూపిస్తే అందరి ముందు మీకు క్షమాపణలు చెబుతానని స్థానిక వైసీపీ నేతలకు అఖిల ప్రియ సూచించారు. మీరు నా సవాల్ కు సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు. నాకు రెడ్ బుక్ ఉంది.. ఎవర్నీ వదలను అని అఖిలప్రియ అన్నారు. రెడ్ బుక్ లో చెడ్డోళ్ల పేర్లు ఉన్నాయి.. నేను ఊరుకునేదాన్ని కాదు.. ఎవర్నీ వదలను. ఒక్కొక్కరికి లెక్క చేప్తానని చెప్పా.. చెప్పి తీరుతా అంటూ అఖిల ప్రియ అన్నారు. అధికారంలోకి వస్తే మీతోలు తీస్తానని గతంలో చెప్పాను. మిమ్మల్ని వదిలేస్తానని ఎందుకు అనుకుంటున్నారు. రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు.. నేను కూడా రెడ్ బుక్ పెట్టుకున్న. నా వల్ల 100 మంది ఇబ్బంది పడబోతున్నారు. 100 మంది లిస్ట్ నా దగ్గర ఉంది అంటూ స్థానిక వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ అఖిల ప్రియ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.
Admin
Studio18 News