Monday, 02 December 2024 12:16:38 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Anakapalle : అనకాపల్లి జిల్లాలో మరో ప్రమాదం.. నలుగురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

Date : 23 August 2024 11:06 AM Views : 48

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Anakapalle pharma company explosion : అనకాపల్లి జిల్లాలో ఎస్సెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం మరువక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ ఫార్మాసెజ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్థలో జరిగిన ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు జార్ఖండ్ వాసులు కాగా.. ఒకరు విజయనగరం వాసిగా గుర్తించారు. వారిలో కే. సూర్యనారాయణ, రోయా అంగిరియా, లాల్ సింగ్ పూర్తి, వైభవ్ కోనలు ఉన్నారు. వీరిలో సూర్యనారాయణది విజయనగరం జిల్లా. అయితే, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గురువారం అర్థరాత్రి దాటిన తరువాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మెరుగైన వైద్యం అందేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులు వెంటనే బాధితుల వద్దకు వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. అనకాపల్లి జిల్లాలోని పారిశ్రామిక వాడలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో 17మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గురువారం అర్థరాత్రి దాటిన తరువాత జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్ధలో రసాయనాలు కలుపుతుండగా ప్రమాదం చోటు చేసుకోవటంతో నలుగురికి గాయాలయ్యాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు