Studio18 News - ANDHRA PRADESH / : ఈనెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుకను ఇవ్వబోతున్నమని టీడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు కడప జిల్లా టీడిపి అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు ఉచితంగా ఇసుక అందించాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా 8వ తేది నుంచి ఉచిత ఇసుకను పంపిణి చేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ వరుస క్రమంలో అమలు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పునః నిర్మించేందుకు రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఢిల్లి పర్యటనకు వెళ్లడం జరిగిందన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డీ ఎన్నోసార్లు ఢిల్లి పర్యటనకు వెళ్లారని, కనీసం ఒక్కసారైనా రాష్ట్ర అభివృద్ధికి కోసం మాట్లడినావా అని ఈ సందర్భంగా ఆయన దుయ్యబట్టారు.
Also Read : kadapa : కడప కలెక్టర్ గా లోతేటి శివ శంకర్ :
Admin
Studio18 News