Studio18 News - ANDHRA PRADESH / : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో దివ్వెల మాధురి సహజీవనం చేస్తోందని ఆయన భార్య వాణి మండిపతూ నిరసన దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో పలాస టోల్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదంలో దివ్వెల మాధురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్సకు నిరాకరిస్తోంది. చనిపోదామనే హైవే పైకి వచ్చానని మాధురి తెలిపింది. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పింది. తన ఆడపిల్లలను సైతం ట్రోల్ చేస్తున్నారని తెలిపింది. తాను మానసికంగా కుంగిపోయానని, తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వాణిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. తనకు ఏమైనా జరిగితే అందుకు వాణినే కారణమని అంటోంది.
Admin
Studio18 News