Friday, 13 December 2024 07:43:56 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

IMD: బంగాళాఖాతంలో గురువారం మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలుపడే అవకాశం

Date : 03 September 2024 02:12 PM Views : 41

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడడంలేదు. కుండపోత వర్షాలకు ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదలతో చాలామంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు మరో హెచ్చరిక చేశారు. ఈ నెల 5న (గురువారం) బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని చెప్పారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనే ఎక్కువగా ఉంటుందని, భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ సోమవారం బులెటిన్ విడుదల చేసింది. అప్రమత్తమైన ప్రభుత్వం.. వాతావరణ శాఖ హెచ్చరికలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేక సూచనలు చేశారు. ముందు జాగ్రత్తలు తీసుకుని నష్ట తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు. ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తపడాలన్నారు. సెలవులు పెట్టొద్దని, ప్రజలకు సేవలందించడంపై ఫోకస్ పెట్టాలని చెప్పారు. కాగా, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిస్థితులకు అనుగుణంగా విద్యాసంస్థలకు సెలవుల విషయంలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. స్వర్ణ, కడెం ప్రాజెక్టుల గేట్లను తెరవడంతో లోతట్లు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్మల్ కలెక్టర్‌ను ఆదేశించారు. ఆ జిల్లాలు ఇవిగో .. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు సిద్దిపేట్, మల్కాజిగిరి జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం మొత్తం 11 జిల్లాల్లో మోస్తరుకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు