Studio18 News - ANDHRA PRADESH / : AP Assembly Sessions 2024: ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీలో ఆమోద ముద్ర పడింది. అలాగే, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పునరుద్ధరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుతో 2022-2023లో విద్యార్థులు పడిన ఇబ్బందులను తెలిపారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో పాలన అందించిన మహానేత ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ సంస్కరణలతో అన్ని వర్గాలు ఆనాడు సంతోషంగా ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వానికి పేర్ల పిచ్చిపట్టిందని విమర్శించారు. కడప జిల్లాను వైఎస్సార్ జిల్లాగా మార్చారని సత్యకుమార్ అన్నారు. దాని వల్ల వైఎస్సార్ ప్రతిష్ఠ ఏమైనా పెరిగిందా అని అడిగారు. లేదంటే కడప ప్రాముఖ్యత ఏమైనా తగ్గిందా అని అన్నారు. ఎన్టీఆర్ తెలుగుజాతి బ్రాండ్ అని, తెలుగుజాతి కోసం పాటుపడిన కృషీవలుడని సత్యకుమార్ చెప్పారు. కాగా, 2022లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా అప్పటి వైసీపీ ప్రభుత్వం మార్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేసింది.
Admin
Studio18 News