Studio18 News - ANDHRA PRADESH / : అన్నమయ్య జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగను రాయచోటి పోలీసులు పట్టుకొని ఎట్టకేలకు ఆయన నేర చరిత్రకు చెక్ పెట్టారు. రాయచోటి పట్టణ శివారులోని గాలివీడు రింగ్ రోడ్డు వద్ద ఎస్సై భక్తవత్సలం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ వాహనాల తనిఖీల్లో పెద్దమండెంకు చెందిన అశోక్ నాయక్ అనే వ్యక్తి ఎటువంటి ఆధారాలు లేకుండా బైక్ పై వెళ్ళుతుండడంతో అనుమానంతో పోలీసులు అతనిని విచారించారు. దాంతో అశోక్ నాయక్ బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగగా విచారణలో వెల్లడైంది. వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడి వద్ద సుమారు 14 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. అశోక్ నాయక్ పై గతంలో అన్నమయ్య జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు ఉన్నట్లు రాయచోటి అర్బన్ సీఐ చంద్ర శేఖర్ మీడియాకు తెలిపారు. రాయచోటి లో యువత బైక్ రేసింగ్ లకు పాల్పడితే చర్యలు తప్పవని, తల్లిదండ్రులు ఎవరు కూడా తమ పిల్లలకు బైక్ ఇవ్వదని ఈ సందర్భంగా సీఐ చంద్ర శేఖర్ విజ్ఞప్తి చేశారు.
Also Read : #visakhapatnam : అల్లూరి స్ఫూర్తిగా పాలన
ADVT
Admin
Studio18 News