Monday, 02 December 2024 05:25:23 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Divvala Madhuri: నా భార్య‌పై నాకు పూర్తి న‌మ్మ‌కం ఉంది: మాధురి భ‌ర్త మ‌హేశ్

Date : 13 August 2024 02:54 PM Views : 44

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, దువ్వాడ వాణిల వ్య‌వ‌హారం రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. సినిమా క‌థ‌ల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ట్విస్టింగ్‌ ఎపిసోడ్స్ ఈ వ్య‌వ‌హారంలో చోటు చేసుకున్నాయి. ఈ క్ర‌మంలో త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసుకుని త‌న‌పై ట్రోలింగ్ చేస్తున్నారనే మ‌న‌స్థాపంతో... ఆగి ఉన్న కారును త‌న కారుతో ఢీకొట్టి ఆత్మ‌హత్యాయ‌త్నం చేశారు. దాంతో ఈ ప్రమాదంలో గాయ‌ప‌డిన ఆమె పలాసలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. తాజాగా మాధురి ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ వ్య‌వ‌హారంపై అమెరికాలో ఉంటున్న మాధురి భ‌ర్త దివ్వెల మ‌హేశ్ చంద్ర‌బోస్ తాజాగా ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడారు. త‌న‌కు రాజ‌కీయాలంటే ఇష్టం లేద‌న్నారు. కానీ, మాధురి ఇష్ట‌ప‌డ‌టంతో వైసీపీలోకి వెళ్ల‌డానికి మ‌ద్ద‌తు ఇచ్చాన‌ని తెలిపారు. త‌న భార్య‌పై త‌న‌కు పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని, ఆమె రాజ‌కీయంగా ఎదుగుతుంద‌నే కావాల‌ని ఈ ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అయిన త‌ర్వాత మాధురి కూడా మీడియాతో మాట్లాడారు. దువ్వాడ వాణి రాజకీయ కోణంలోనే త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఆ కార‌ణంగానే తాను ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశానని ఆమె చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు