Friday, 13 December 2024 08:30:40 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Nara Lokesh: ఐఐటీ విద్యార్ధికి మంత్రి నారా లోకేశ్ భరోసా

Date : 05 August 2024 11:41 AM Views : 45

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఓ పేద విద్యార్ధి ఉన్నత చదువుకు టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. లక్నో ఐఐటీలో చదువుకోవాలన్న ఆ విద్యార్ధి కలను లోకేశ్ సాకారం చేస్తున్నారు. లక్నో ఐఐటీలో కోర్సు ఫీజు రూ.4 లక్షలు ఉందని, అంత ఖర్చు భరించే స్థితిలో తన తల్లిదండ్రులు లేరని ఎక్స్(ట్విటర్) వేదికగా నారా లోకేశ్‌కు ఆ విద్యార్థి తెలియజేయగా, వెంటనే స్పందించిన లోకేశ్ అతనికి భరోసా ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామానికి చెందిన బసవయ్య అనే విద్యార్థికి ఇటీవల లక్నో ఐఐటీలో సీటు వచ్చింది. అయితే కోర్సు ఫీజు రూ.4 లక్షలు చెల్లించాల్సి ఉంది. పేదరికంలో ఉన్న తన తల్లిదండ్రులు అంత ఫీజు భరించే పరిస్థితి లేకపోవడంతో బసవయ్యకు ఏమి చేయాలో పాలుపోలేదు. తల్లిదండ్రులు కూడా కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆ డబ్బుతోనే ఇప్పటి వరకూ అతన్ని చదివించారు. ఐఐటీ ర్యాంక్ సాధించినా లక్నో ఐఐటీలో విద్యనభ్యసించలేని పరిస్థితి బసవయ్యది. ఈ నేపథ్యంలో తన పరిస్థితిని బసవయ్య ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మంత్రి నారా లోకేశ్ కు విన్నవించాడు. లక్నో ఐఐటీలో సీటుకు ఫీజు చెల్లించే ఆర్థిక స్తోమత తమకు లేదని, చదువుకోవాలనే కోరిక బాగా ఉందని, తన పరిస్థితి చూసి సాయం చేయాలని బసవయ్య కోరాడు. దీనికి స్పందించిన లోకేశ్ రీట్వీట్ చేశారు. "బసవయ్య, నువ్వు ఐఐటీ లక్నోలో చదువుతావు. నీ కల నెరవేరుతుంది. నీ ఫీజు విషయం నేను చూసుకుంటా. నీకు శుభాకాంక్షలు" అంటూ లోకేశ్ రీట్వీట్ చేశారు. దీంతో లోకేశ్ భరోసా పట్ల నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. విద్యార్థి కుటుంబసభ్యులు సైతం లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు