Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : CM Chandrababu Naidu : కలెక్టర్ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు పనిచేయకపోయినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. లక్ష్యాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఈ కాన్ఫరెన్స్ చరిత్ర తిరగరాయబోతోందని చెప్పారు. ప్రజా వేదికలో కలెక్టర్ల సదస్సు పెట్టి ఆనాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజావేదిక కూలగొట్టేశారు. విధ్వంసం సృష్టించారు. గత ఐదేళ్ల కాలంలో విధ్వంసంతో పాటు.. పనిచేసే అధికారులను పక్కన పెట్టారు. బ్లాక్ మెయిల్ చేశారని చంద్రబాబు అన్నారు. మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారుతాయి. మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉంటామని చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్ల పాటు కలెక్టర్లతో సమావేశమే పెట్టలేదు. గత ఐదేళ్ల పాలన ఎంత దారుణంగా ఎందో అర్ధం చేసుకోవచ్చు. ఇకపై ప్రతి మూడు నెలలకొసారి కాన్ఫరెన్స్ ఉంటుంది. నా పనితీరుపైన కూడా రివ్యూ ఉంటుంది. ఎవరు పనిచేయకపోయినా చర్యలు తప్పవు. నేను కూడా సమయపాలన పాటిస్తానని చంద్రబాబు అన్నారు.
Admin
Studio18 News