Studio18 News - ANDHRA PRADESH / : ఇటీవల కృష్ణా నది వరదలకు నాలుగు బోట్లు కొట్టుకువచ్చి ప్రకాశం బ్యారేజి గేట్లను బలంగా ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దాంతో, బ్యారేజిలో 67, 69 నెంబరు గల గేట్లు దెబ్బతిన్నాయి. దాంతో, కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించి, గేట్ల మరమ్మతులను విజయవంతంగా పూర్తి చేసింది. కేవలం రెండ్రోజుల్లోనే గేట్లకు మరమ్మతులు చేసి, కౌంటర్ వెయిట్లను అమర్చారు. కృష్ణా నది ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో, ఎంతో రిస్క్ తీసుకున్న ఇంజినీర్లు, ఇతర సిబ్బంది మరమ్మతులు నిర్వహించారు. 1.5 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నప్పటికీ వెనుదీయకుండా, భారీ వర్షాన్ని లెక్కచేయకుండా పనులు పూర్తి చేశారు. ఇంజినీరింగ్ అండ్ ఇరిగేషన్ నిపుణుడు కన్నయ్యనాయుడు నేతృత్వంలో ఈ మరమ్మతుల ప్రక్రియ కొనసాగింది. కాగా, ప్రకాశం బ్యారేజి గేట్లకు అమర్చిన కౌంటర్ వెయిట్లను హైదరాబాద్ కు చెందిన బెకెం ఇన్ ఫ్రా కంపెనీ తయారుచేసింది. వీటిని ఆధునిక టెక్నాలజీ సాయంతో ఉక్కు రాడ్లతో రూపొందించారు. ఒక్కో కౌంటర్ వెయిట్ బరువు 17 టన్నులు.
Admin
Studio18 News