Monday, 02 December 2024 04:44:36 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

CM Chandrababu: బెంగాల్ మాజీ సీఎం మృతిపై చంద్ర‌బాబు దిగ్భ్రాంతి

Date : 08 August 2024 02:50 PM Views : 54

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ప‌శ్చిమ‌ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య (80) గురువారం క‌న్నుమూశారు. బుద్ధదేవ్ తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. గత కొంత కాలంగా చికిత్స పొందుతున్నారు. ఈ క్ర‌మంలో ఇవాళ ఉద‌యం తుదిశ్వాస విడిచిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. కాగా, బుద్ధదేవ్ భట్టాచార్య 2000 నుంచి 2011 వరకు బెంగాల్ సీఎంగా పని చేశారు. ఐదు దశాబ్దాల పాటు రాజకీయల్లో కొనసాగారు. అయితే, 2011లో జరిగిన ఎన్నికలలో బుద్ధదేవ్ ఓటమి పాలయ్యారు. ఆయన ఓటమితో బెంగాల్ లో 34 సంవత్సరాల సీపీఐ(ఎమ్) పాలన ముగిసింది. ఇక బుద్ధదేవ్ మ‌ర‌ణం గురించి తెలుసుకుని ప‌లువురు ప్ర‌ముఖులు విచారం వ్యక్తం చేశారు. ఈ క్ర‌మంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కూడా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆయ‌న మృతిప‌ట్ల సంతాపం తెలిపారు. "ప్రముఖ సీపీఐ(ఎమ్) నేత‌, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య మ‌ర‌ణ‌వార్త దిగ్భ్రాంతి క‌లిగించింది. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా సేవకు అంకిత‌మైన మ‌హామ‌నిషి. ప్ర‌జా సేవ‌ పట్ల ఆయ‌న‌ సరళత, అంకితభావాన్ని మెచ్చుకోకుండా ఉండ‌లేం. ఆయ‌న‌ తన రాష్ట్రం ఆధునిక చరిత్రను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను" అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు