Monday, 02 December 2024 05:18:37 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Visakha MLC By Poll: చంద్రబాబు సంచలన నిర్ణయం.. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి దూరం

Date : 13 August 2024 01:19 PM Views : 34

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం జరగనున్న ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో గెలవడం పెద్ద కష్టం కాదని, అయినప్పటికీ హుందా రాజకీయాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.చంద్రబాబు నిర్ణయంపై కూటమి నేతలు కూడా హర్షం వ్యక్తం చేశారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించారని కొనియాడారు. కాగా, ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. కాగా, ఈ ఎన్నికలో జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్టణం, యలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 60 శాతానికిపైగా వైసీపీ నుంచి గెలిచినవారే. అభ్యర్థిని పోటీకి నిలిపితే గెలిపిస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు ముందుకొచ్చినప్పటికీ అంత ప్రయాస అవసరం లేదని చంద్రబాబు భావించారు. ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం అంతమందిని ప్రత్యర్థి పార్టీ నుంచి సమీకరించాల్సిన అవసరం లేదని, దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదని చంద్రబాబు అభిప్రాయపడినట్టు తెలిసింది. ఇదిలావుంచితే, ఈ స్థానం నుంచి వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు