Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Duvvada Srinivas Press Meet: తన భార్య వాణిపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఆయన మీడియా సమాశంలో మాట్లాడుతూ.. కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసినా, తనపై వాణి 24 గంటలూ విషం చిమ్మిందని వెల్లడించారు. రాజకీయ కాంక్షతోనే తనను వేధించిందని ఆరోపించారు. తన జీవితాన్ని అస్తవ్యస్తం చేసిందని, ఆమెతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తన భార్య వెనుక మంత్రి అచ్చెన్నాయుడు ఉండి ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. తన ప్రాణానికి ఏం జరిగినా అచ్చెన్నాయుడిదే బాధ్యత అన్నారు. తన రాజకీయ జీవితాన్ని వాణి నాశనం చేసిందని, ఆమె అహంకారి అని దుయ్యబట్టారు. తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోతే చస్తానని వాణి బెదిరించిందని వెల్లడించారు. ”నా భార్యతో అనుక్షణం నరకం అనుభవించాను. నా కుటుంబమే నన్ను ప్రశ్నిస్తోంది. నా పాతికేళ్ల కష్టాన్ని వదులుకుని 100 మెట్లు దిగి నా భార్యేకే టిక్కెట్ ఎనౌన్స్ చేశాను. అయితే అధిష్టానం నన్నే పోటీ చేయమనడంతో పార్టీ కోసం పనిచేశాను. కానీ నా భార్యే వ్యతిరేకంగా పనిచేసింది. నన్ను ఓడించడానికి టీడీపీతో చేతులు కలిపింది. నా భార్యను ఎంతో బాగా చూసుకున్నాను, కానీ ఆమె రాజకీయ కాంక్షతో ఎంతో వేధించింది. నా తల్లిని కూడా ఇంట్లోకూడా రానీయలేదు. వ్యాపారంలో వచ్చిన డబ్బును వాణి చేతుల్లోనే పెట్టాను. తనకే అన్ని కావాలన్న అహంకారంతోనే ఇదంతా చేసింది. వాణితో కలిసుండే ఉద్దేశం నాకు లేదు. పిల్లల బాధ్యత మాత్రం నాదే. ఆస్తులన్నీ తన భార్యకు రాసిస్తాన”ని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు.
Admin
Studio18 News