Sunday, 08 February 2026 01:07:37 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

త్వరలో జన్మభూమి 2, నామినేటెడ్ పదవుల భర్తీ- టీడీపీ పొలిట్‌బ్యూరో కీలక నిర్ణయాలు

Date : 08 August 2024 04:39 PM Views : 311

Studio18 News - ANDHRA PRADESH / : Tdp Politburo Meeting : టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. సుమారు 3 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ కొలిక్కి వచ్చిందని పొలిట్ బ్యూరో సమావేశంలో సీఎం చంద్రబాబు అన్నారు. దశల వారీగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తానన్నారు. త్వరలో జన్మభూమి-2 కార్యక్రమం ఉంటుందని తెలిపారు. పేదరిక నిర్మూలనపై పొలిట్ బ్యూరోలో నాయకులు చర్చించారు. అక్టోబర్ 2న విజన్ డాక్యుమెంట్, ఆగస్టు 15 అన్న క్యాంటీన్ల ప్రారంభం ఉంటుందన్నారు. ఎస్సీ వర్గీకరణకు జిల్లా యూనిట్ గా తీసుకోవాలని నిర్ణయించారు. నామినేటెడ్ పోస్టులకు ఎవరి రెకమెండేషన్లు అవసరం లేదు- అచ్చెన్నాయుడు ”నామినేటెడ్ పోస్టులకు ఎవరి రెకమెండేషన్లు అవసరం లేదు. ఎవరు కష్టపడి పని చేశారో అధినేతకు అన్నీ తెలుసు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని అధినేత చెప్పారు. అన్ని పనులు వెంట వెంటనే అయిపోవాలని కార్యకర్తలు గాబరా పడుతున్నారు. కార్యకర్తలు సంయమనం పాటించాలి. పార్టీల వారీగా నామినేటెడ్ పోస్టుల్లో పర్సంటేజ్ లంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తము. కూటమి తరఫున కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తున్నాం. పొలిట్ బ్యూరోలో 55 రోజుల పాలనపై చర్చించాము. త్వరలో జన్మభూమి 2 ప్రారంభం కాబోతుంది. జన్మభూమి 2 కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ప్రాజెక్టులు నిండటంతో జగన్ గుండె నీరుకారుతోంది. నామినేటెడ్ పోస్టులు అతి త్వరలో భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇసుకలో అక్రమాలు సహించబోనని అధినేత మరోసారి హెచ్చరించారు. జనాభా నియంత్రణ వలన డీలిమిటేషన్ లో దక్షిణ భారత దేశానికి అన్యాయం జరుగుతోంది. ఒక్క యూపీలో 140 పార్లమెంటు స్థానాలు వస్తే దక్షిణ భారత దేశంలో 160 మాత్రమే ఉంటాయి. జనాభా తగ్గడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోతాయి” అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :