Studio18 News - ANDHRA PRADESH / : Duvvada Srinivas : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారంలో రచ్చ కొనసాగుతూనే ఉంది. ఇప్పట్లో ఈ వివాదానికి ఎండ్ కార్డు పడే అవకాశాలు కనిపించడం లేదు. దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య, కుమార్తె ల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ అవి ఫలించడం లేదు. దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్న ఇంటి ఎదుట అతని భార్య వాణి, ఇద్దరు కుమార్తెలు నిరసన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వారి నిరసన 10వ రోజుకు చేరుకుంది. దువ్వాడ శ్రీనివాసు, అతని భార్య వాణి మధ్య రాజీకోసం కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో దువ్వాడ నివాసం ఉండే కొత్త ఇంటి ఎదుటే కారు సెడ్ లో వాణి, ఆమె కుమార్తెలు హైందవి, నవీనలు నిరసన తెలుపుతున్నారు. కొత్త ఇంట్లోనే ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఉంటున్నాడు. అతని వద్దకు తమ్ముడు శ్రీధర్ వచ్చి వెళ్తున్నాడు. పోలీస్, కోర్టు జోక్యం చేసుకుంటుందని దువ్వాడ భావిస్తున్నాడు. తమకు దువ్వాడ కొత్త ఇంటిలోకి అనుమతి ఇవ్వాలని ఆయన భార్యాబిడ్డలు నిరసన తెలుపుతున్నారు.
Admin
Studio18 News