Saturday, 07 March 2026 09:14:34 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలిన అధికారులు

Date : 05 August 2024 03:13 PM Views : 492

Studio18 News - ANDHRA PRADESH / : నాగార్జున సాగర్ ప్రాజెక్టులోని ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. అధికారులు కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేశారు. ఎగున నుంచి భారీగా వరద నీరు నాగార్జున సాగర్‌లోకి చేరుతోంది. దీంతో కొన్ని గేట్లను ఎత్తారు. తొలుత దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు మూడుసార్లు సైరన్ మోగించారు. ఆ తర్వాత ఒక్కో గేటును ఎత్తారు. సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీశైలం నుంచి వచ్చే వరదను అంచనా వేసి మరిన్ని గేట్లను ఎత్తే అవకాశముంది. నల్గొండ, సూర్యాపేట, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కో గేట్ నుంచి 7,300 క్యూసెక్కుల చొప్పున మొత్తం 43,800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, సాగర్ ప్రస్తుత నీటి మట్టం 582.60 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 290.51 టీఎంసీలు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ఇన్-ఫ్లో 3,23,748 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 83,331 క్యూసెక్కులు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :