Monday, 02 December 2024 03:41:23 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Pawan Kalyan : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం పవన్ సంచలన నిర్ణయం.. ఏపీ చరిత్రలో ఇదే మొదటిసారి..

Date : 10 August 2024 10:56 AM Views : 68

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Pawan Kalyan : ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త కొత్త పథకాలు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే రాజకీయాల్లో, పాలనలో కొత్త మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న పొలిటికల్ లీడర్లకు భిన్నంగా కొత్త కొత్త కార్యక్రమాలు, ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే పాలనలో తన మార్క్ చూపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందరిలో దేశభక్తి పెంపొందించాలని, ప్రతి గ్రామంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సెలబ్రేట్ చేయాలని పవన్ కళ్యాణ్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా గ్రామ పంచాయితీల్లో ఆగస్టు 15న వేడుకలకు ఇప్పటి వరకూ మైనర్ పంచాయతీలకు 100 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు ఇస్తున్నారు. అయితే ఈ నిధులను ఒకేసారి గణనీయంగా పెంచింది ఏపీ ప్రభుత్వం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతీ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఆ రోజు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత ఉండకూడదని, అందుకు తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తూ గతంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మైనర్ పంచాయతీలకు 100 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. 2011 జనాభా ఆధారంగా 5 వేలులోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 వేలు, 5వేలు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 వేలు అందించనున్నారు. ఈ మొత్తంతో స్వాతంత్ర్య దినోత్సవం రోజున కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు కూడా ఇదే విధంగా రూ.10 వేలు, రూ.25 వేలు చొప్పున నిధులు అందిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ డబ్బుతో పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టత, రాజ్యాంగ విలువ, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాస రచన, క్విజ్, డిబేట్ లాంటి పోటీలు, ఆటల పోటీలు నిర్వహించి, జెండా ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, పంచాయితీ ఉద్యోగులు అంతా ఇందులో పాల్గొనాలని సూచించారు పవన్ కళ్యాణ్.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు