Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : మంత్రి నారా లోకేశ్ నోట మరోసారి 'రెడ్ బుక్' మాట వచ్చింది. మంగళగిరిలో ఓ దాత నిర్మించిన ఆలయ ముఖద్వారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలను ఇబ్బంది పెట్టిన వారంతా రెడ్ బుక్‌లో ఉన్నారని అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌లపై నివేదిక రాగానే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయన్నారు.
Admin
Studio18 News