Monday, 28 April 2025 06:31:56 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

Aaradhya: 'ఆరాధ్య' వినాయక పూజ కిట్.. ఒక క్లిక్ తో అందమైన విగ్రహం, 21 రకాల పత్రులు, 30 రకాల పూజాసామగ్రి.. ఇప్పుడే బుక్ చేసుకోండి!

Date : 31 August 2024 03:56 PM Views : 97

Studio18 News - ANDHRA PRADESH / : హిందువులు ఎంతో భక్తి భావంతో, నియమనిష్ఠలతో చేసుకునే వినాయకచవితి పండుగ వచ్చేస్తోంది. అప్పుడే వినాయక విగ్రహాలు రోడ్ల పక్కన దర్శనమిస్తున్నాయి. మరోవైపు భక్తులకు కొన్నేళ్లుగా వినాయక విగ్రహాన్ని, పూజకు అవసరమైన పూజా పత్రులను, పూజా సామగ్రిని ఒక కిట్ రూపంలో అందిస్తున్న మన ‘ఆరాధ్య’ సంస్థ కూడా మళ్లీ మన ముందుకు వచ్చేసింది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు, ప్రయాసలు లేకుండా వినాయక పూజను నిర్వహించుకునేందుకు తన వంతుగా తోడ్పాటును అందించేందుకు ఆరాధ్య సిద్ధమయింది. ఆన్ లైన్ లో కిట్ ల బుకింగ్స్ ను ప్రారంభించింది. వినాయకుడు, లంబోదరుడు, గణేషుడు ఇలా ఎన్నో పేర్లతో ఆ గణనాథుడిని భక్తులు కొలుచుకుంటుంటారు. కష్టాలు, కడగండ్లు, సమస్యలు, ఇబ్బందుల నుంచి తమను గట్టెక్కించి... సుఖసంతోషాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని భక్తిశ్రద్ధలతో వినాయకుడిని హిందువులు పూజిస్తుంటారు. వినాయకుడికి పూజ చేసి పనులు మొదలుపెడితే చేపట్టిన కార్యక్రమం విఘ్నాలు లేకుండా పూర్తవుతుందనేది భక్తుల నమ్మకం. అందుకే ఏ పూజ అయినా, ఏ కార్యక్రమమైనా తొలి పూజ అందుకునేది వినాయకుడే. వినాయకుడికి పూజ చేసిన తర్వాతే ఇతర దేవుళ్లకు పూజలు చేయాలనేది పురాణ ఆచారం. వినాయకచవితిని భక్తులు తమ శక్తిమేర ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి... రకరకాల పువ్వులు, పత్రులతో పూజ చేసుకుంటారు. బొజ్జ గణపయ్యకు కుడుములు, ఉండ్రాళ్లు, మోదకాలు, లడ్డూలు, పాలతాలికలు తదితర పిండి వంటకాలను నైవేద్యాలుగా సమర్పిస్తారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి సందడి మొదలయింది. పూజకు అవసరమైన వినాయకుడి ప్రతిమలను కొనే పనిలో భక్తులు ఉన్నారు. పూజకు అవసరమైన పూజసామగ్రిని ఎక్కడ కొనాలా? అని ఆలోచిస్తున్నారు. అయితే, వినాయకచవితి రోజున స్వామి పూజ అంటే అంత ఈజీ కాదు. స్వామిని ఏయే పత్రులతో పూజించాలో మనలో చాలా మందికి కనీస అవగాహన ఉండదు. మార్కెట్ కు వెళ్తే వ్యాపారులు మనకు పిచ్చిపిచ్చి ఆకులను అంటగడతారు. వారిచ్చిన పిచ్చిపిచ్చి ఆకులతోనే మనకు తెలియక పూజలు కానిస్తుంటాం. దీంతో, మనకు పూజా ఫలితం పూర్తి స్థాయిలో దక్కదు. భక్తులను ఈ సమస్య నుంచి గట్టెక్కించడానికి 'ఆరాధ్య' సంస్థ మరోసారి మన ముందుకు వచ్చింది. అందమైన వినాయకుడి ప్రతిమతో పాటు 21 రకాల పూజ పత్రులు… పసుపు, కుంకుమ, దీపాలు, ఆవు నెయ్యి, అక్షింతలు, ప్రసాదం, కర్పూరం, వస్త్రం, పూజ ఎలా చేసుకోవాలో వివరించే పుస్తకంతో సహా 30 రకాల పూజాసామగ్రిని ఒక కిట్ రూపంలో అందిస్తోంది. ఈ కిట్ ద్వారా 12 ఇంచుల ఎత్తైన గణనాథుడి ప్రతిమను అందజేస్తోంది. మరోవైపు 21 రకాల పత్రులు ఏంటో అర్థమయ్యే విధంగా వాటి పేర్లను కూడా వాటికి అతికిస్తోంది. ఒక్కో కిట్ ను రూ. 1,500కు అందిస్తోంది. అంతే కాదు వినాయకుడి పూజను ప్రారంభం నుంచి చివరి వరకు ఎలా చేసుకోవాలో వివరించే వీడియోను కూడా 'ఆరాధ్య' ఆన్ లైన్ ద్వారా అందిస్తోంది. ఈ వీడియో ద్వారా పూజారి లేకుండానే మనం మన ఇంట్లో సొంతంగా ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా పూజను నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. వినాయకుడి పూజ కిట్లను ఆరాధ్య సంస్థ హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, గుంటూరు, మంగళగిరి నగరాల ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కిట్లను పొందాలనుకునే వారు ఆన్ లైన్ ద్వారా లేదా ఫోన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. www.aaradhya.in వెబ్ సైట్లోకి లాగిన్ అయి కిట్ ను బుక్ చేసుకోవచ్చు. లేదా 9494563839, 9849610015 నంబర్లకు ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కిట్లను ఆర్డర్ చేసుకున్న వారు కింద పేర్కొన్న పికప్ పాయింట్ల వద్ద వాటిని తీసుకోవచ్చు. వినాయక పూజ కిట్ పికప్ పాయింట్లు: హైదరాబాద్: జూబ్లీహిల్స్ - టీ3, థర్డ్ ఫ్లోర్, గ్రీన్ వ్యూ ప్లాజా, రోడ్ నంబర్ 1 & 68 మణికొండ - మర్రిచెట్టు జంక్షన్ వద్ద గుడిమల్కాపూర్ - సత్య శోభ అపార్ట్ మెంట్, శారదానగర్ కాలనీ కొండాపూర్ - గ్రీన్ టెర్రేసెస్ అపార్ట్ మెంట్స్, వైట్ ఫీల్డ్స్ అమీర్‌పేట్ - శ్రీ కార్తికేయ ప్రింటర్స్, గ్రౌండ్ ఫ్లోర్, షాప్ నెం. 23, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా కూకట్ పల్లి - ప్లాట్ నంబర్ 153, రోడ్ నంబర్ 24, వివేకానందనగర్ కాలనీ నిజాంపేట్ - ప్లాట్ నంబర్ 29 & 30, షాప్ నంబర్ 2, సాయిరత్న, శ్రీనివాసనగర్ కాలనీ చందానగర్ - సంగం డెయిరీ పార్లర్, రైల్వే స్టేషన్ రోడ్, ఐసీఐసీఐ ఏటీఎం పక్కన సికింద్రాబాద్ - రైల్ నిలయం పక్కన నాచారం - రిలయన్స్ డిజిటల్ వద్ద, రవీంద్రనగర్ ఈసీఐఎల్ - ఏసియన్ రాధిక మల్టీప్లెక్స్ వద్ద, డాక్టర్ ఏఎస్ రావు నగర్ రోడ్ కొత్తపేట - విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ వద్ద సుచిత్ర - సుచిత్ర క్రాస్ రోడ్స్ వద్ద నల్లగండ్ల - రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద ఆర్టీసీ క్రాస్ రోడ్స్ - ఆర్టీసీ కల్యాణమంటపం వద్ద విజయవాడ: ఎంజీ రోడ్ - ఫార్మా జనరిక్ హౌస్ వద్ద, రాఘవయ్య పార్క్ రోడ్, గోల్డెన్ పెవిలియన్ ఎదురుగా, గవర్నర్ పేట తాడేపల్లి - ఉషోదయ సూపర్ మార్కెట్ వద్ద విశాఖపట్నం: *ఎన్ఏడీ కొత్త రోడ్డు, ఎన్ఏడీ జంక్షన్ *డెయిరీ ఫామ్, ఆంజనేయస్వామి విగ్రహం వద్ద *మాధవధార, ఈస్ట్ పార్క్ వద్ద మంగళగిరి - డీటీడీసీ కార్యాలయం వద్ద గుంటూరు - విద్యానగర్ బెంగళూరు: మారతహళ్లి - మార్నింగ్ స్టార్ ట్రావెల్స్, కళామందిర్ ఎదురుగా, ఎయిర్ టెల్ 4జీ స్టోర్ పక్కన ఆనంద్ రావ్ సర్కిల్ - మార్నింగ్ స్టార్ ట్రావెల్స్, స్విస్ కాంప్లెక్స్, బీ-5, #33, రేస్ కోర్స్ రోడ్, మాధవ నగర్, గాంధీనగర్ మడివాళ - మార్నింగ్ స్టార్ ట్రావెల్స్, 85, బేస్ మెంట్, హోసూరు మెయిన్ రోడ్, వెంకటేశ్వర హాస్పిటల్ పక్కన ఆరాధ్య వినాయక పూజ కిట్ లో స్వామి వారి ప్రతిమ, ప్యాకింగ్ మెటీరియల్, జూట్ బ్యాగ్ అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ కావడం గమనార్హం. భక్తులకు సురక్షితమైన, సంపూర్ణమైన కిట్లను అందించాలనే లక్ష్యంతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న వేణుగోపాలస్వామి లంకోతు 'ఆరాధ్య' సంస్థను స్థాపించారు. ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన 'ఆరాధ్య' అనతికాలంలోనే భక్తుల ఆదరాభిమానాలను చూరగొంది. ప్రతి ఏటా మరింత ఎక్కువ మంది భక్తులకు చేరువవుతోంది. హెచ్చరిక: ఆరాధ్య పేరుతో కొందరు నకిలీ కిట్లను విక్రయిస్తున్నారు. ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని భక్తులను ఆరాధ్య సంస్థ కోరుతోంది. ఆరాధ్య సంస్థ అధికారిక వెబ్ సైట్ www.aaradhya.in వెబ్ సైట్లోకి లాగిన్ కావడం ద్వారా లేదా 9494563839, 9849610015 నెంబర్లకు ఫోన్ చేయడం ద్వారా మాత్రమే ఆర్డర్లను బుక్ చేసుకోవాలని విన్నవిస్తోంది. భక్తులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :