Studio18 News - ANDHRA PRADESH / : మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్‌ను ఓపెన్ చేయకూడదని వైసీపీ నేతలు కోరుకుంటున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. రెడ్ బుక్ అంటే చాలు... వైసీపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... ఉనికి కోసమే ఢిల్లీలో జగన్ ధర్నా డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ ఆరోపించారని... వివరాలు అడిగితే పారిపోయారని విమర్శించారు. రాష్ట్రంపై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిని జగన్ ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. విజయవాడ నుంచి అన్ని నగరాలకు త్వరలో ఎయిర్ కనెక్టివిటీ రానుందన్నారు. ఇందుకు అనుగుణంగా కొత్త టెర్మినల్ ఏడాదిలోపే పూర్తి కానుందన్నారు. విజయవాడ మహానాడు సెంటర్ నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి గడ్కరీ అంగీకరించినట్లు చెప్పారు. ఐదు నెలల్లో విజయవాడ పశ్చిమ బైపాస్ ప్రజలకు అందుబాటులోకి రానుందన్నారు. అమరావతికి పావుగంటలో చేరుకునేలా పశ్చిమ బైపాస్‌లో రేడియల్ రోడ్లను అనుసంధానం చేస్తామన్నారు. రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా విజయవాడ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామన్నారు.
Admin
Studio18 News