Studio18 News - ANDHRA PRADESH / : తనకు భద్రతను కుదించారంటూ ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం విచారణ చేపట్టింది. జగన్‌కు భద్రత ఇవ్వడం లేదని, అలాగే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పని చేయడం లేదని వైసీపీ అధినేత తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. జగన్‌కు సెక్యూరిటీని తగ్గించారని... జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కొనసాగించాలని కోరారు. ప్రముఖులకు భద్రత విషయంలో రాజీపడవద్దని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై వివరాలు అడిగింది. అయితే జగన్‌కు నిబంధనల ప్రకారం భద్రతను ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జామర్ ఏర్పాటుపై మధ్యాహ్నం లోపు స్పష్టత నివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది.
Admin
Studio18 News