Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : మహిళలు, బాలికలపై అనునిత్యం అత్యాచారాలు, హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ఓ అనాథ బాలికపై అత్యాచారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే బాధితురాలు తిరుపతిలోని జువైనల్ హోమ్ లో ఉంటోంది. నేర చరిత్ర కలిగిన బాలికలతో పాటు అనాథ బాలికలు ఈ జువైనల్ హోమ్ లో ఉంటున్నారు. ఈ గృహంలో స్థానిక నెహ్రూ మున్సిపల్ స్కూల్ లో సదరు బాలిక 9వ తరగతి చదువుతోంది. రిషి అనే యువకుడు స్టడీ అవర్ సమయంలో బాలికపై అత్యాచారం చేశాడు. ఒంటిపై గాయాలతో జువైనల్ హోమ్ కు వెళ్లిన బాలికను తోటి విద్యార్థులతో పాటు సిబ్బంది ప్రశ్నించారు. దీంతో జరిగిన విషయాన్ని వారికి బాధితురాలు వివరించింది. ఈ క్రమంలో జరిగిన ఘటనపై వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, బాలికను వైద్య పరీక్షల కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Studio18 News