Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : అమెరికాలో స్థిరపడ్డ తెలుగు తేజం కృష్ణ చివుకులను చెన్నైలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సమేతంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఏపీతో పాటు రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించాలని చివుకులను కలిశెట్టి కోరారు. అలాగే ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రారంభిస్తున్న అన్న క్యాంటీన్ల నిర్వహణకు సాయం చేయాల్సిందిగా కోరారు. తాను చదువుకున్న మద్రాస్ ఐఐటీకి రూ. 228 కోట్ల విరాళం ఇవ్వడంపై చివుకులను ఎంపీ కలిశెట్టి అభినందించారు.
Admin
Studio18 News